మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప్రజలకు దూరమై ఎనిమిదేండ్లవుతున్నది. కాబట్టి దేశం మళ్లీ ప్రగతి మార్గంలో నడవాలంటే, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే దేశానికి సరైన నాయకుడు కావాలి. యావత్ దేశాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడి కోసం దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.
కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి ఇప్పుడు అవసరమని ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా వ్యూహాత్మకంగా అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట, నేర్పరి. దేశానికి బీజేపీ నాయకులు చేస్తున్న అన్యాయాన్ని,ఏం చేస్తే దేశం బాగుపడుతుందో ప్రజలకు ఆయన వివరిస్తున్న తీరును చూసి మేధావులు, బుద్ధిజీవులు సైతం ఆలోచనలో పడుతున్నారు.
జేపీ ఎనిమిదేండ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి ఏమని పరికించి చూస్తే అంతా శూన్యమే. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ప్రజల్ని మతాల వారీగా చీల్చే కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు తిరస్కరించిన రాష్ర్టాల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇందుకోసం అధికార పార్టీల్లో ఉన్న నాయకులకు డబ్బును ఎరగా చూపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఢిల్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు జేయచూడటమే. దేశవ్యాప్తంగా బీజేపీ అమలుచేస్తున్న విధానం ఇదే. లేకుంటే ఈడీ, సీబీఐ దాడుల పేర బెదిరింపులకు పాల్పడటమే ఆ పార్టీ అసలు రహస్యం. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికను చూడాల్సిన అవసరం ఉన్నది. అవసరం లేని ఉప ఎన్నికను సృష్టించి తమ బలాన్ని నిరూపించుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతున్నది.
మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనా విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మొదలు నేటి రూపాయి విలువ అధఃపాతాళానికి పడిపోయేదాన్క వైఫల్యాలే తప్ప విజయాలు శూన్యం. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల కేంద్రం ఆశించిన ఫలితాలు రాకపోగా ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టకు భంగం వాటిల్లిందనడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై మనకన్నా చిన్న దేశాలైన పాకిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల స్థాయికి దిగజారుతున్నామనడంలో సందేహం లేదు.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశానికి అన్నం పెట్టింది మాత్రం రైతన్న. అలాంటిది రైతును అధోగతి పాలు చేయడానికి కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఏడాదిపాటు రైతులు ఢిల్లీ గల్లీల్లో పోరాటం చేస్తే వాళ్లపై తీవ్రవాదులనే అపవాదు మోపి వందల మంది ప్రాణాలను బలిగొన్నది. రైతులను చిత్రవధకు గురిచేసింది. ఆఖరికి రైతుల నిరసనలకు, ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం రైతుల కాళ్ల ముందు మోకరిల్లి నల్లచట్టాలను వెనుకకు తీసుకున్నది. మోదీ ప్రభుత్వం. కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ లాంటి సంస్థలను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయం తీసుకొని దేశాన్ని అమ్మే ప్రయత్నం జేస్తున్నది.
దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే బీజేపీని ఎన్నుకోవాల్సి వచ్చింది తప్ప, బీజేపీ ఏదో ఒరగబెడుతందని మాత్రం కాదు. కానీ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా బీజేపీ అందినకాడికి దండుకుంటున్నది. ఆఖరికి దేశాన్నే అమ్మకానికి పెట్టింది. అందుకే దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యామ్నాయం ఎవరా అని తరచి చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. కేంద్రంలో ‘తెలంగాణ మోడల్’ ప్రభుత్వం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి ఇప్పుడు అవసరమని ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా వ్యూహాత్మకంగా అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట, నేర్పరి. దేశానికి బీజేపీ నాయకులు చేస్తున్న అన్యాయాన్ని, ఏం చేస్తే దేశం బాగుపడుతుందో ప్రజలకు ఆయన వివరిస్తున్న తీరును చూసి మేధావులు, బుద్ధిజీవులు సైతం ఆలోచనలో పడుతున్నారు.
ప్రజలకు అందాల్సిన ఫలాలను, ప్రజా ప్రయోజనాలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి మోదీ పండుగ చేసుకుంటున్నారు. పేదరిక నిర్మూలన, సహజ వనరుల వినియోగం, ప్రజల జీవితాల్లో మార్పు, అన్ని రంగాల్లో సమూల మార్పులు జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు… దేశం బాగుపడ్డట్టు. కానీ నేడు దేశంలో పేద ప్రజలు ఇంకా దారిద్య్రపు రేఖకు దిగువనే ఉన్నారు. సంపద పెంచాలి… పేదలకు పంచాలనేది కేసీఆర్ నినాదం. కానీ మోదీ ప్రభుత్వం పేదల సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు పంచి పెడుతున్నది.
కేసీఆర్ నాడు తెలంగాణ బానిస సంకెళ్లను తెంపారు. ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణను సమూలంగా అభివృద్ధి చేసి దేశానికే దిక్సూచి అయ్యారు. కేసీఆర్ వ్యూహం, చతురత, దూరదృష్టి, విషయ పరిజ్ఞానం, సంకల్పం, పట్టుదల దేశానికి కొత్త తొవ్వ చూపిస్తుందనటంలో సందేహం లేదు. మతవిద్వేష, విచ్ఛిన్నకర శక్తులను పారదోలి ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలే ముందుకు రావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.
-తాడబోయిన విజయ్
94919 98702