తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? మరో మహత్తర పోరాటానికి తెలంగాణ గడ్డ నాంది పలకబోతున్నదా? గతంలో జరిగిన ఉద్యమాలు పునరావృతం కాబోతున్నయా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఔననే సమాధానం చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో జరుగుతున్న నిర్బంధకాండపై, గిరిజనుల భూ పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా యుద్ధభేరీ మోగడం గమనార్హం. లగచర్లలో తిరుగుబాటు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించడమే కాదు, ఊరూరా తిరుగుబాటు ఉద్యమాలకు ఊపిరిపోసింది.
మహబూబాబాద్‌లో గిరిజనులంతా ఏకమై ఈ నెల 25వ తేదీన గిరిజన సభ నిర్వహించబోతున్నారు. లంబాడ గిరిజను లు లగచర్లకు తోటి గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని, వారికి సంఘీభావం గా ఆ సభ నిర్వహించనున్నారు. అందుకే గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయంపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా మహబూబాబాద్ గిరిజను లు సభ నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుడుతున్నది. ఆ సభకు అనుమతి ఇవ్వకపోవడమే అందుకు తార్కాణం. లగచర్ల లడాయి ఇక రాష్ట్ర లడాయిగా మారబోతుందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే 20వ తేదీన ఆ సభను నిర్వహించాలని గిరిజనులు అన్నిరకాలుగా సమాయత్తమైతే, అర్ధరాత్రి సభ అనుమతులను పోలీసులు రద్దుచేసి తమ నియంతృత్వాన్ని, నిర్రంకుశత్వాన్ని చాటుకున్నా రు.
అర్ధాంతరంగా సభ అనుమతిని ఎందుకు రద్దు చేశారనడిగితే… పైనుంచి ఆదేశాలు వచ్చిన ట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. అయినా గిరిజన ప్రజలు ఏ మాత్రం అదరకుండా, బెదరకుండా ఎలాగైనా సభ నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీ నేతల వారి సూచనల తో మహబూబాబాద్ రైతులు కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. లగచర్ల గిరిజన రైతు లకు మద్దతుగా సభ నిర్వహించేందుకు మాకు అనుమతులు ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకు న్నారు. వారి మొరను ఆలకించిన రాష్ట్ర అత్యున్న త న్యాయస్థానం ఈ నేల 25వ తేదీన సభ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో గిరిజనుల న్యాయ పోరాటం ఫలించింది.
తమ కు, తమ గళాలకు స్వాతంత్య్రం వచ్చిందన్నట్టుగా, తాము తొలి విజయం సాధించామన్నట్టుగా, సమరోత్సాహంతో గిరిజనులు సభ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. ఎక్కడో జరిగిన లగచర్లకు, ఇక్కడ ఉన్న మానుకోటకు సంబం ధం ఏమున్నదనే ప్రశ్న అన్ని వర్గాల్లో రావచ్చు. అయితే, లగచర్ల లడాయి ఒక్క కొడంగల్‌కే పరిమితం కాలేదు. అది రాష్ట్రమంతటా విస్తరించిం ది. అందులో భాగంగానే మానుకోటలో సభ జరుగనున్నది. తెలంగాణ ఉద్యమం కూడా మానుకోట నుంచే మలుపు తిరిగిందన్న వాస్తవాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవావాలి.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానుకోట గిరిజన రైతులు మరో ఉద్యమానికి ముగ్గు పోస్తున్నట్టే అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకున్నా.. మహబూబాబాద్ గిరిజన సభలో వక్తలు తెలిపే సంఘీభావం, ఆ సభలో చేసే గిరిజనుల తీర్మానాలు లగచర్ల రైతులకు కొండంత భరోసాను ఇవ్వనున్నాయి. మానుకోట ప్రజలు, బీఆర్ఎస్ నేతలే కాదు, మహబూబ్‌నగర్ నుంచి ములుగు దాకా, మధిర నుంచి మెదక్ దాకా… యావత్ రాష్ట్ర రైతాంగం లగచర్ల కర్షకులకు అండగా
నిలవనున్నదనే సంకేతాలు యువనేత కల్వకుంట్ల తారక రామారావు నోట వెలువడనున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి న తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. రైతాంగం కష్టాలకు భూ సమస్యలు తోడవ్వడంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గుర్తుకొస్తున్నది. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతు కూలీలు తిరగబడిన అపూర్వ ఘట్టం కండ్ల ముందు కదలాడు తున్నది. రక్తాక్షరాలతో చరిత్ర లిఖించిన సంద ర్భమది. నేడు లగచర్ల ఘటన కూడా అచ్చం అలాగే తలపిస్తున్నది.
ఫార్మా విలేజీ కోసం రైతుల భూములను కాంగ్రెస్ సర్కార్ గుంజుకుంటున్న తీరు, వారిపై పోలీసులు చేస్తున్న దాష్టీకాన్ని చూస్తుంటే రజాకార్లే గుర్తుకొస్తున్నా రు. ఇదిలా ఉంటే సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంతేకాదు, తమ చావుకు కారణం సీఎం, అతని అన్నదమ్ములేనని వాంగ్మూలం రాసి చనిపోతున్నారు. ఇంతటి విషాదం ఈ ప్రజాస్వా మ్య దేశంలో నేనెప్పుడూ చూడలేదు. అయినా ఈ ఘటనపై ముఖ్యమంత్రి కాని, ఆయన మంత్రివర్గం కాని స్పందించడం లేదంటే రైతు లపై వారికి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. డైవర్షన్ రాజకీయాల్లో ఆరితేరిన ముఖ్యమంత్రి సందెట్లో సడేమియా అన్నట్టు ధాన్యం కొనుగోళ్ల సమస్యను పక్కదారి పట్టించారు.
బోనస్ ఇస్తా మని బోగస్ మాటలు మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు చెయ్యిస్తున్నది. అంతేకాదు, గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును రేవంత్ సర్కారు ఎత్తివేసింది. రైతులకు రుణమా ఫీ చేశామని ప్రగల్భాలు పలుకుతూ పల్లెలకు పోతున్న కాంగ్రెస్ నాయకులను తరుముతున్నా రు. ఇదిలా ఉంటే విద్యుత్ కోతలు గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. సబ్సిడీలను నిలిపివేయడంతో రైతులు, రైతు కూలీలు కాంగ్రె స్ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. మొత్తంగా ఆకలిచావులు, ఆత్మహత్యలతో రాష్ట్రం తెల్లవారు తున్నది.
ఏడాది కూడా పూర్తవకుండానే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయారు.అందుకేనేమో నాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం సాగినట్టే.. నేడు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. తెలంగా ణ గడ్డ మీద భూ పోరాటాలు, ఉద్యమాలకు రైతులు కదం తొక్కుతున్నారంటే.. రేవంత్ నేతృత్వంలోని ఈ నెనరు లేని కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డట్టే లెక్క.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి