మామూలుగా శాండ్విచ్ ఓ 20 రూపాయలకో.. మరీ స్పెషల్ అయితే 50 రూపాయలకో దొరుకుతుంది. అట్లాంటిది రూ.16 వేల ఖరీదంటే నమ్మషక్యంగా లేదు కదూ. అయినా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ శాండ్విచ్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ శాండ్విచ్లో న్యూయార్క్‌లోని సెరెండిపిటీ -3 రెస్టారెంట్లో మాత్రమే దొరుకుతుంది.
రికార్డు సైజులో దొరికే ఈ శాండ్విచ్ కావాలంటే 48 గంటల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆర్డర్ చేయాల్సిందేనని సెలవిస్తున్నారు సెరెండిపిటీ -3 రెస్టారెంట్ యాజమాన్యం. ఎందుకంటే దీని తయారీకి కావాల్సిన మసాలా దినుసులు సిద్ధం చేసుకోవడానికి కనీసం ఒక్క రోజు సమయం పడుతుందంట. దీని క్రిస్పీ, క్రీమీ టేస్ట్ మరెక్కడా దొరుకదని సెరెండిపిటీ-3 రెస్టారెంట్ బల్లగుద్ది మరీ చెప్పున్నది. సర్వ్ చేయడానికి నాలుగు నిమిసాల ముందు గ్రిల్లింగ్ చేయడం వల్లనే దీని టేస్ట్ అదిరిపోతుందని వారంటున్నారు. ఈ శాండ్విచ్ పేరు క్వింటెన్షయల్ గ్రిల్డ్ ఛీజ్.
ఈ శాండ్విచ్ ఎందుకంత ఖరీదంటే.. వీటి తయారీలో బంగారు పొరలను వాడతారు. ఈ బంగారు పొరలు శాండ్విచ్ను మరింత ఆకర్శణీయంగా చేస్తుంది. ఈ శాండ్విచ్ ఫ్రెంచ్ పుల్మాన్ షాంపైన్ రొట్టె ముక్కల నుంచి మాత్రమే తయారు చేస్తారు. దీనిలో ఉపయోగించే జున్ను ప్రత్యేక ఆవు పాలు నుంచి సేకరిస్తారు. ఈ రకం ఆవులు సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పాలిస్తుంటాయి. వీటన్నింటి కారణంగా ఈ శాండ్విచ్ ప్రత్యేక రుచిని కలిగివుంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. గత ఏడేండ్లుగా అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌గా ఈ రెస్టారెంట్ పేరు నమోదవుతుండటం విశేషం.
తొలి త్రైమాసికంలో అదరగొట్టిన హిందూస్తాన్ యూనిలీవర్
ఉయ్ఘర్ ముస్లింలపై హింసకు చైనా నిర్బంధ కేంద్రాలు
చైనాలో విషాదం.. హైవే టన్నెల్ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..