ఎంత నేర్చుకున్నావు అనేది కాదు.. ఎన్ని పుస్తకాలు చదివావు.. అనేది ముఖ్యం. పుస్తక పఠనం అనేది చాలా మంచి అభిరుచి, అలవాటు. ఈ ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన మహనీయులంతా వేల పుస్తకాలను చదివినవాళ్లే. అసలు.. ఈ జనరేషన్‌కు పుస్తకాలు చదివే అలవాటే లేదు. కానీ.. పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అది జీవితంలో ఎలా ముందడుగు వేయాలో చెబుతుంది.
అయితే.. చాలామందికి ఏ పుస్తకాలు చదవాలి.. ఏవి చదివితే బెటర్.. ఏవి చదవకూడదు.. అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ పుస్తకం.. ఈ పుస్తకం అని కాదు..కానీ అభిరుచి మేరకు అంతో ఇంతో నాలెడ్జ్ ఇస్తుంది.. అని అనుకుంటే ఏ పుస్తకాన్ని అయినా చదవొచ్చు.
అందుకే.. మైక్రోసాఫ్ట్ సీఈవో, చైర్మన్ సత్య నాదెళ్ల, అమెజాన్ కోఫౌండర్ జెఫ్ బెజోస్ కొన్ని పుస్తకాలను రెకమండ్ చేస్తున్నారు. ఈ పుస్తకాలను అందరూ చదవాలంటూ వాళ్ల చాలా ఇంటర్వ్యూలో సేమ్ ఇవే పుస్తకాల గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఆ పుస్తకాలు ఏంటి? వాటి స్పెషాలిటీ ఏంటి? ఎందుకు వాళ్లు ఈ పుస్తకాలను రెకమండ్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
దావోస్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ 50వ ఆన్యువల్ మీటింగ్‌లో ఈ పుస్తకం గురించి సత్య నాదెళ్ల ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని జేమ్స్ ఏ రాబిన్సన్ రచించారు. ఈ సమాజం ఏం ఆశిస్తుంది.. ప్రభుత్వాలు ఏం కోరుకుంటాయి.. వీటి మధ్య.. ఒక మనిషి ఎలా నారో కారిడార్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు.. అనే అంశాలపై ఈ పుస్తకంలో రచయిత విపులంగా చర్చించారు. ఈపుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలంటూ.. దావోస్ మీటింగ్‌లో నాదెళ్ల స్పష్టం చేశారు.
ఈపుస్తకాన్ని కారొల్ ఎస్ డ్వెక్ అనే రచయిత రచించాడు. ది న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం గురించి కూడా సత్య నాదెళ్ల అదే మీటింగ్‌లో ప్రస్తావించారు. మనలో మార్పు ఎలా వస్తుంది. దానికి కారణం ఏంటి.. దేని వల్ల మనలో మార్పు వస్తుంది.. అనే కాన్సెప్ట్‌తో రచయిత ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ పుస్తకాన్ని డేనియల్ జేమ్స్ బ్రౌన్ అనే రచయిత రచించాడు. ఈ పుస్తకం గురించి ఫాస్ట్ కంపెనీ ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ప్రస్తావించారు. టీమ్ వర్క్ ముఖ్య పాత్ర ఏంటి? సీఈవో గానే కాకుండా.. ఔట్ ఆఫ్ ది బాక్స్‌లోకి వెళ్లి నేను ఎలా నా ఫోకస్‌ను పెడతాను.. అనే దానికి ఈ పుస్తకమే నాకు ప్రేరణ.. అని సత్య నాదెళ్ల ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ పుస్తకం గురించి కూడా సత్య నాదెళ్ల ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని మార్కో ఐయానిస్టి, కరీమ్ లఖానీ సంయుక్తంగా రచించారు. ఒక కంపెనీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. అని భావించేవాళ్లు.. ఏఐ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని నాదెళ్ల వెల్లడించారు.
ఈ పుస్తకాన్ని బ్రాడ్ స్మిత్ రచించారు. ఓ ట్వీట్లో ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు నాదెళ్ల. టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య వస్తే.. ఏం చేయాలి? టెక్నాలజీ తప్పిదం వల్ల.. మనిషి జీవితం ఎలా తలకిందులు.. అవుతుంది అనే కాన్సెప్ట్‌తో వచ్చిన పుస్తకం ఇది.. అని నాదెళ్ల ట్వీట్లో స్పష్టం చేశారు.
ఈ పుస్తకాన్ని జిమ్ కోలిన్స్ అనే రచయిత రచించారు. సక్సెస్ఫుల్ హాబిట్స్ ఆఫ్ విజనరీ కంపెనీస్ అనే కాన్సెప్ట్‌తో ఈ పుస్తకం రిలీజ్ అయింది. ఇది నా ఫేవరేట్ బిజినెస్ పుస్తకం.. అని అమెజాన్ కోఫౌండర్ జెఫ్ బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ పుస్తకం గురించి కూడా జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాతనే అమెజాన్ వెబ్ సర్వీస్ లేదా ఏడబ్ల్యూఎస్ అనే సర్వీసులను ప్రారంభించామని జెఫ్ వెల్లడించారు.
ఈపుస్తకాన్ని కూడా జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. దీన్ని జాసన్ ఫ్రైడ్, డేవిడ్ హైనేమియర్ హాన్సన్ రచించారు. ఒక బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే.. ఆ బిజినెస్ రూల్స్ కొత్తగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి.. అప్పుడే.. ఒక బిజినెస్ సక్సెస్ అవుతుంది.. అని నేను నమ్ముతా… అని ఈ పుస్తకం గురించి చెబుతూ.. జెఫ్ బెజోస్ పైవ్యాఖ్యలు చేశారు.
ఈ పుస్తకాన్ని నాసిమ్ నికోలస్ టాలెబ్ రచించారు. జీవితంలో జరిగే కొన్ని అనూహ్యమైన ఘటనలను అంతగా పట్టించుకోరు.. అయితే.. జీవితంలో ఏం చేసినా కూడా అది ఒక ప్రయోగమే.. అంటూ జెఫ్ బెజోస్ తెలిపారు.
ఈ పుస్తకాన్ని క్లేటన్ ఎమ్ క్రిస్టెన్సన్ రచించారు. ఇది కూడా ఒక బిజినెస్ బుక్. అమెజాన్‌లో భాగంగా కిండిల్, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ను ప్రారంభించడానికి.. ఈ పుస్తకంలోని విషయాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.. అని ఈ పుస్తకం గురించి జెఫ్ చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
1971 ఎంత స్పెషలో ! ఒక్క ఏడాదిలోనే ఎన్నెన్ని అద్భుతాలో !!
ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా
ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన గడియారం ఇది.. విశ్వం గురించి చెబుతున్నదేంటి?