దళిత బంధు పథకంపై ఎన్నారైల హర్షం
ఎన్నారై | తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు.
దళితుల సాధికారత కోసం తెచ్చిన తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని అనిల్ కూర్మాచలం తెలిపారు. నాడు హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభానికి కూడా హాజరవుతానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Dalit Bandhu
- happy
- NRIs
- ఎన్నారై
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

