77th Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్లో భారతదేశపు తొలి మహిళా రాయబారి అయిన పరమిత త్రిపాఠి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీతోపాటు అమరవీరులైన సైనికులకు పుష్పగుచ్ఛాలు సమర్పించి.. నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఆమె చదివి వినిపించారు.
ఈ కార్యక్రమానికి పరమిత త్రిపాఠి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కువైట్లో ఇది నా మొదటి గణతంత్ర దినోత్సవం, మీ అందరి మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నాకు గౌరవంగా ఉందన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తనకు లభించిన ఆప్యాయతకు సమాజానికి ధన్యవాదాలు పరమిత త్రిపాఠి తెలిపారు. ఈ నియామకం మహిళా నాయకత్వం, సాధికారత పట్ల భారతదేశం పెరుగుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.
రాయబారి పరమిత త్రిపాఠి తన వ్యాఖ్యలను ముగిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసులు భారతదేశానికి నిజమైన రాయబారులు అని సమాజ సభ్యులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికి ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కువైట్లోని భారతీయ పౌరులు, భారతదేశ స్నేహితులు, సమాజ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ గొప్ప కళా సంప్రదాయాలను అందంగా ప్రదర్శించిన మనోహరమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

Kuwait
