Sunita Williams | ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) కేరళ (Kerala) రాష్ట్రాన్ని సందర్శించారు. అక్కడ కోజికోడ్‌లోని ఫేమస్ ఫలూదా షాప్‌ను విజిట్ చేశారు. వెర్మిసెల్లి (సేమ్యా)తో ప్రత్యేకంగా తయారు చేసిన ఫలూదా (falooda)ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఫలూదా నేషన్ అనే అవుట్లెట్ స్టోర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేము అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
కాగా, సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా గత వారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచే ఇది అమలులోకి వచ్చిందని నాసా పేర్కొంది. ‘‘మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ మార్గదర్శకురాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన సేవలు చంద్రుడు, మార్స్‌పై భవిష్యత్తులో చేయబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయి’’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
Also Read..
Indian Railways | ట్రైన్ ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని.. రూ.9 లక్షల పరిహారం
Viral Video | సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ను కారుతో గుద్ది హతమార్చిన వ్యక్తి
Snowfall | హిమాచల్‌లో తీవ్రమైన మంచు.. వెయ్యికిపైగా రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు