Nagaraju Gurrala | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అత్యంత అనుచితమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం దక్షిణాఫ్రికా తీవ్రంగా ఖండిస్తోందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా విభాగం అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమేకాకుండా, తెలంగాణలోని సుమారు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉందన్నారు.. ఇది తెలంగాణ ప్రజల గౌరవాన్ని, స్వాభిమానాన్ని అవమానపరిచే వ్యాఖ్యగా భావిస్తున్నామన్నారు.
తెలంగాణ సాధన కోసం దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, ముఖ్యంగా విద్యార్థులు, యువత, అమరుల త్యాగాలను ఈ వ్యాఖ్యలు అవమానిస్తున్నాయి. భారత రాజ్యాంగ పరిమితులలోనే, శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దానిని విభజనతో పోల్చడం అనేది భారత సమాఖ్య వ్యవస్థపై అవగాహన లేమిని సూచిస్తుంది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, గుర్తింపు, చరిత్రపై నేరుగా దాడి చేసినట్లే. ప్రాంతీయ ఉద్యమాలను తక్కువ చేసి చూపించి, రాజకీయ లాభాల కోసం విభజన సృష్టించే బీజేపీ నాయకత్వంలోని కొన్ని వర్గాల మనస్తత్వాన్ని ఇది బయటపెడుతోందన్నారు.
తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని, బీజేపీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రజల గౌరవం, చరిత్ర, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్