హైదరాబాద్: ఇటీవల శస్త్ర చికిత్సకు గురై కోలుకుంటున్న జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్లోని వారి స్వగృహంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్రెడ్డి త్వరగా పూర్తి ఆరోగ్యాన్ని సాధించి, ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐల తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral news | ప్రియుడితో లేచిపోయిన భార్య.. విడాకులు తీసుకుని భర్త ఏం చేశాడంటే..!
Anurag Kashyap | అతడికి ఇండియా అర్థం కాదు.. నెట్ఫ్లిక్స్ ఇండియా సీఈవోపై అనురాగ్ కశ్యప్ విమర్శలు
Kota Srinivasa Rao | కోట శ్రీనివాసరావు మృతితో కన్నీరు పెట్టుకున్న బాబు మోహన్