హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సినీ ప్రముఖలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన ఆరోపణలపై తక్షణమే ఉప సంహరించుకోవాలి. అలాగే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం హేయమనై చర్యగా అభిర్ణించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హై కమాండ్ తక్షణమే మంత్రిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు(కొండా సురేఖ) చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని సరిద్దుకోవాలని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
KTR | పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం : కేటీఆర్