NRI BRS Cell | జూబ్లీహిల్స్‌లో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే వున్నారు. జూబ్లీహిల్స్ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాదుతూ.. బీఆర్ఎస్ పాలనా దేశానికే ఆదర్శంగా నిలిచింది. యువతకు ఉపాధి కల్పిస్తూ దీంతోపాటు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచాలనే స్పూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది . తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ హయాంలో దివంగత మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గా తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయినా కాంగ్రెస్ చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు ఇప్పుడు నమ్మె స్థితిలో లేరు . హైడ్రా తెచ్చి పేదోళ్ల ఇండ్లు కూలగొడుతున్నారు, పెద్దోళ్ల ఇండ్లను కాపాడుతున్నారు. ఓటు కోసం వస్తే ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా వున్నారు.
ప్రజలను ఎక్కడ చూసినా వారి నోటా కాంగ్రెస్ పరిపాలన బాగా లేదు. గతంలో కేసీఆర్ పాలనే బాగుంది కాంగ్రెస్ కు ఓటు వేచి తప్పు చేసాము మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. భర్త చనిపోయిన ఆడబిడ్డ బాధతో కన్నీళ్లు పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.
గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు..
కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో మరోవైపు గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు
పెట్టడం సిగ్గు చేటు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు సునీతా గోపినాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సన్నద్ధంగా వున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ఎమ్మెల్యే గా నామినేషన్ వేసిన శుభసందర్బంగా వారికి మా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
Kumuram Bheem | కుమ్రం భీం Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ
పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య