పెద్దన్నా వందనం
తెలంగాణ తల్లి పిలుపు తొలి అడుగులో అడుగు త్యాగాలజెండా చేతపట్టి జనగర్జనలో జనపదమై వెరవని పదంలా నిలబడి మహోద్యమంలో వెన్నుదన్నై తానొక స్తంభమై నిలిచాడు.
తెలంగాణ తల్లి పిలుపు
తొలి అడుగులో అడుగు
త్యాగాలజెండా చేతపట్టి
జనగర్జనలో జనపదమై
వెరవని పదంలా నిలబడి
మహోద్యమంలో వెన్నుదన్నై
తానొక స్తంభమై నిలిచాడు.
సంకల్పమే ఊపిరిగా
ఆశయాల గుండె సవ్వడిగా
ఆకాంక్ష జెండా వదలని ధీరుడు
కాలం గడిచినా
కర్తవ్యమే దిక్సూచిగా
నినాదాల్లో నిప్పురవ్వ,
నడకలో నిబద్ధతై
తెలంగాణ ఆత్మగౌరవమై
ప్రతిధ్వనించాడు
రాష్ట్ర సాధన పోరులో శ్రమ ఊరకపోలే
పునర్నిర్మాణ వికాసంలో
రామప్ప చెరువులా నిలబడ్డాడు
కుట్రల పళ్లాలకు తలొంచని
నర్సంపేట నగారా
తెలంగాణ రైతు
నాగలి జెండాగా నిలిచి
పోరు గాలై వీచి, ఓరుగల్లు
కెరటమైన యోధుడు
వానలు, పండుగలు వచ్చిపోతుంటయి
గాలిపతంగులు ఎగురుతుంటయి
మెరుపులు మెరుస్తుంటాయి
వేటికీ చేయిచాపని ఆశయం
తెలంగాణనే తన స్వప్నమన్న కిశోరం!
నెగడులా నిలువెత్తు మాట
మాటమీద నిలబడే కడలి
ఆరోగ్యాలు అనారోగ్యాలు
మంచిగున్న మామిడిపండ్లకే!
పూలపాన్పు కాదు
స్వరాష్ట్ర సాధనకై
నిలబడ్డ యోధ !
దుఃఖం కొత్తది గాదు
బాధలు నేటివి గావు
నిఖార్సయిన ఉద్యమకారుడు
హఠాత్తుగా వెళ్లిపోవడం
తెలంగాణ దోసిట్లో దుఃఖం
తెలంగాణ జెండా
ఎగిరే ప్రతి క్షణంలో
మీ త్యాగాల
ప్రతిధ్వని వినిపిస్తుంది.
ఆ విజయంలో ఉద్యమ సైనికుల
చెమట చుక్కలు,
కన్నీటి బిందువులు,
అచంచల సంకల్పమే
శాశ్వత సాక్ష్యాలు
పెద్దన్నా వందనం!
– వనపట్ల సుబ్బయ్య 9492765358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

