BRS Denmark President | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజకీయ ప్రతీకార చర్యలను బలంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ పేర్కొన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు వంటి నాయకులకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణలు జరిపిన తర్వాత, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖర్ రావుకు (కేసీఆర్) కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత నిరంకుశ, పక్షపాత రాజకీయ వైఖరిని సూచిస్తుందన్నారు. ఈ చర్యలు కేవలం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ అభివృద్ధికి చేసిన అద్భుత కృషిని, రైతు సంక్షేమం, యువత ఉపాధి, మహిళల సాధికారత వంటి విప్లవాత్మక పథకాలను మరచిపోయి, కేవలం రాజకీయ ద్వేషంతో ఇలాంటి కేసులను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు వైఖరిని ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, ప్రజల సంక్షేమానికి అంకితమైన నాయకుడు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు, నోటీసులు పూర్తిగా రాజకీయ కుట్రలే అని స్పష్టంగా తెలుస్తుంది.
బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, డెన్మార్క్‌లోని తెలంగాణ ప్రవాసులు అందరూ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతారు. ఈ రాజకీయ వేధింపులను బలంగా ఖండిస్తూ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, పక్షపాత రహితంగా విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుంది, ప్రజల సేవకు అంకితమవుతుందన్నారు.