గాంధారి, సెప్టెబంర్ 26: క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని పేట్‌సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలన్నారు. మండలంలోని యువకులు, క్రీడాకారుల సౌకర్యార్థం గాంధారిలో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆటల్లో క్రీడాస్ఫూర్తి అవసరమన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర పోటీలను నిర్వహించారు. మండలంలోని ఆయా పాఠశాలల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గాంధారి/ ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 26: గాంధారి తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 94మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడ బిడ్డలకు అండగా నిలుస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పరమేశ్, గాంధారి విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, మాజీ జడ్పీటీసీ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో మన్నె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యక్రమలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.