వర్ని (రుద్రూర్),అక్టోబర్ 9 : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామస్తులు బుధవారం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
వారం రోజులుగా గ్రామంలో తాగునీరు సరఫరా కావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.