రెంజల్ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అరిగోస పడుతున్నారు. సాగు, తాగు నీరు కోసం అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్ల కోసం మహిళలు మైళ్లదూరం ప్రయాణించిచాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. తాజాగా మండలంలోని కందకుర్తిలో గ్రామంలో మంచి నీటి కోసం మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల తీరును ఎండగడుతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాగునీటి సమస్య జఠిలంగా మారిన అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజల కనీస కనీస సౌకర్యాలు కల్పించ లేకుండా పోతున్నారని మహిళలు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా, గ్రామ కార్యదర్శి నవీన్ మహిళల ఆందోళన గమనించి అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం.