ఖలీల్‌వాడి, అక్టోబర్ 4 : నిజామాబాద్ జిల్లా ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలో మొత్తం 13 లక్షల 65 వేల 811 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పోలింగ్స్టేషన్లు, మహిళలు, పురుషులు, ఇతరుల ఓటర్ల వివరాలను తెలిపారు. జిల్లాలో మహిళా ఓటర్లు 7,18,603 ఉండగా.. పురుషులు 6,47,149, ఇతరులు 59 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం.