Strike Notice | సిరికొండ మే 19 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐకేపీ వీవోఏలకు కనీస వేతనాలు అందించాలని మండల సమైఖ్య ఆధ్వర్యంలో ఏపీఎం సువర్ణకు, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో మంగళవారం వీవోఏలు సమ్మె నోటీసులు అందజేశారు. ఐకేపీ వవీవోఏలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని, అర్హులైన వీవోఏలను గుర్తించి సీసీలుగా పదోన్నతి కల్పించాలని, రూ.20 లక్షల బీమా వర్తింపజేయాలని, గ్రామాల్లో ఉచిత ట్యాబ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, ఐడి కార్డు అందజేయాలని, జీవో నెంబర్ 58 సవరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని వేతనాల పెంపు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేకుంటే దశలవారీగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మున్ సింగ్, జ్యోతి, సీహెచ్ లక్ష్మి, ఎస్ లక్ష్మీ, సునీత, సారా, లావణ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.