జెన్ జీ ప్రశ్నిస్తదనే డైవర్షన్ పాలిటిక్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జెన్ జీ యువత ప్రశ్నిస్తారనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- రేవంత్‌రెడ్డిపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు ఫైర్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జెన్ జీ యువత ప్రశ్నిస్తారనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించడం కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకేనని దుయ్యబట్టారు. యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే మల్లికార్జున్ఖర్గేను అధ్యక్షుడిగా తప్పించి, యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామన్న రేవంత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటీ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. విద్యాశాఖ నిర్వహణలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ మంత్రి పదవి అప్పగించాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

