పాత ఇనుప షాపులో బ్యాలెట్ బాక్స్!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానం ఉన్న బ్యాలెట్ బాక్స్ నల్లగొండ పట్టణంలో పాత ఇనుప సామగ్రి దుకాణంలో ప్రత్యక్షమైంది. సాధారణంగా ఎన్నికలు ముగిసిన అ నంతరం వాటిని సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పటిష్ట బందోబ స్తు నడుమ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు.
- స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సింది దుకాణంలో..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానం
- విచారిస్తున్న నల్లగొండ టూటౌన్ పోలీసులు
నీలగిరి, జూలై 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానం ఉన్న బ్యాలెట్ బాక్స్ నల్లగొండ పట్టణంలో పాత ఇనుప సామగ్రి దుకాణంలో ప్రత్యక్షమైంది. సాధారణంగా ఎన్నికలు ముగిసిన అ నంతరం వాటిని సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పటిష్ట బందోబ స్తు నడుమ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. అక్కడ ఉండాల్సిన బాక్స్ ఇనుప సామగ్రి షాపులో బయటపడడంతో అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. అది కూడా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరగడం చర్చనీయాంశంగా మారింది.
బాక్స్ పై ఉన్న అక్షరాలను టీఎస్ ఈసీ జేఎస్ బీపీ పరిశీలిస్తే అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బ్యాలెట్ బాక్స్‌గా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే గత మూడు రోజుల కితం ఎవరో వ్యక్తి దుకాణాదారుడికి రూ.150కి అమ్మినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న నల్ల గొండ టూటౌన్ ఎస్ఐ డీ సైదాబాబు ఈ బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు ఎలా వచ్చింది? ఎన్నికల సంఘం అధికారికంగా పాత సామానుగా వేలం వేసిందా? లేక మరే ఇతర మార్గంలో బయటకు చేరిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనతో ఇలాంటి బ్యాలెట్ బాక్సులు మరెన్ని బయటకు వచ్చాయనే అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాక్స్‌ను కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై దుకాణ యజమానిని ప్రశ్నించగా సుమారు మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఈ బాక్స్‌ను తమకు విక్రయించినట్లు చెప్పాడు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

