బోధన్ రూరల్, మే 5: ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ -ఖండ్గామ్ గ్రామాల రోడ్డుపై కల్దుర్కి గ్రామ రైతులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
కొన్ని నెలల నుంచి మంజీరా నది నుంచి ఇసుక టిప్పర్లు అధికలోడ్తో వెళ్తున్నాయని, దీంతో రోడ్లు ధ్వంసమై పంట పొలాలకు వెళ్లాలంటే దారి లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే ఇసుక రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.