Sirikonda | సిరికొండ, మే 2 : సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు ఏమి కల్పించడం లేదని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించడానికి లారీ డ్రైవర్ కు రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు.
హామాలి ఛార్జీలు అదనంగా తీసుకుంటున్నారని, లారీలు సకాలంలో రావడం లేదని అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సెంటర్ ఇంచార్జీ అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ అధికారులు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.