భీమ్‌గల్/మోర్తాడ్, జూలై 10: భీమ్‌గల్, మోర్తాడ్ మండలాల్లోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి మండలం ఇనాయత్‌నగర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మెట్టు సాయన్న ఇటీవల కాలం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ.10వేల ఆర్థికసాయం అందించారు.
భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్‌లో బీఆర్ఎస్ కార్యకర్త బక్కన్నోళ్ల సతీశ్, గ్రామ బీఆర్ఎస్ నాయకుడు మండ్ర సుమన్, శాంకూరి మహేందర్, దేవేందర్ ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. తండ్రిని కోల్పోయిన ప్రేమ్‌చంద్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. అనంతరం మెండోరా గ్రామానికి వెళ్లి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం ఇంటికి చేరిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ తక్కూరి రాజేందర్‌ను పరామర్శించారు.
బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి ముత్తెన్న మేనల్లుడు చిన్న వయసులోనే మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. జాగిర్యాల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పెద్దోళ్ల రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వేముల వెంట బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, జడ్పీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ ఎంఏ మొయిజ్, బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, మలావత్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.