రామారెడ్డి, సెప్టెంబర్ 14: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడంలేదు. యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం పనులు మానుకొని గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాచారెడ్డి సొసైటీ పరిధిలోని అన్నారం, రెడ్డిపేట్ గ్రామాల్లో యూరియా కోసం ఆదివా రం ఉదయం 5 గంటల నుంచి రైతు లు బారులు తీరారు.
అన్నారంలో వరుసలో చెప్పులను ఉంచగా.. రెడ్డిపేట్‌లో యూరియా పంపిణీ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. దీంతో స్థానిక ఎస్సై లావణ్య అక్కడికి చేరుకున్నారు. కామారెడ్డి నుంచి ఫోర్స్‌ను తెప్పించి పోలీసు పహారా మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. అన్నారంలో 440, రెడ్డిపేట్‌లో 440 బస్తాల యూరియా పంపిణీ చేయగా..కొంతమంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా పంపిణీ కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సందర్శించి, రైతులతో మాట్లాడారు.