Uniforms distributed | పోతంగల్, జులై 3: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజేసినట్లు అయన వివరించారు. 136 మంది బాలికలు, 213 మంది బాలురకు సరిపడా యూనిఫాం లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులకు ఒక జత యూనిఫాంలను అందజేయగా, రెండో జత త్వరలో అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సాయిలు, ఉపాద్యాయులు నాగ్ నాథ్, రామారావు, షబానా, సుజాలత తదితరులు ఉన్నారు.