Kotagiri | కోటగిరి, జూలై 30 : మేత కోసం వెళ్లిన అవులు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కోటగిరి మండలం సుద్దులం గ్రామానికి చెందిన గోపు బంగారి సాయిలు అనే వ్యక్తి తన రెండు ఆవులు మేత కోసం గ్రామ శివారులో తీసుకెళ్తున్నాడు.
కాగా గ్రామ సమీపంలో రోడ్డుకు పక్కనే అనుకొని ఉన్న సింగిల్ ఫేస్ డిటీఆర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి సుమారు రూ.2లక్షలు విలువ చేసే పాడి ఆవులు అక్కడిక్కడే మృతి చెందాయి. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. రెండు ఆవులు సుమారుగా రూ.2లక్షలు ఉంటుందని, పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.