ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 25 : ఆర్మూర్ కొత్త బస్టాండ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. బస్టాండ్‌లో ఉన్న మ హిళలను ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉం దని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసిందన్నా రు. మిగతా పథకాలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ప్రయాణికుల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మరో రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని తెలిపారు. అవసరమైన రూట్లలో కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.
ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గతంలో లీజుకు ఇచ్చిన స్థలాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.