Traffic rules must | ఆర్మూర్ : వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పత్రాలు, హెల్మెట్, నంబర్ ప్లేట్లు సరిగా లేనివారికి జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్ తప్పకుండా సీట్ బెల్ట్ ను వాడాలని సూచించారు. వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు మైనర్ పిల్లలు వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని, ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.