Hanmant Shinde | బిచ్కుంద(జుక్కల్) జులై 14 : ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్, పిట్లం, మహ్మద్ నగర్, నిజాంసాగర్, పెద్ద కొడప్ గల్,బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ అన్ని మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, బీసీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.