బాన్సువాడ, జనవరి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు (ఆదివారం) నిజామాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 12గంటలకు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్‌కు హాజరవుతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తబ్లీగీ జమాత్ వేదిక, రెండు గంటలకు వర్ని మండలంలోని బడా పహాడ్ దర్గా(పెద్ద గుట్ట)ను సందర్శిస్తారని తెలిపారు.
సాయంత్రం 4గంటలకు బాన్సువాడకు వస్తారని పేర్కొన్నారు. ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని కొయ్యగుట్ట అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొని, బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతారని తెలిపారు. పార్టీ నాయకులు, రైతులు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.