ఆర్మూర్‌టౌన్, డిసెంబర్7: నవమాసాలు మోసి కనిపెంచిన కుమారులను విక్రయించడం ఆర్మూర్‌లో కలకలం రేపింది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్య నారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూ ర్ మండలం మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన ముగ్గురు కుమారులను పది నెలల క్రితం వివిధ ప్రాంతాల్లో విక్రయించింది.
ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు భాగ్యలక్ష్మిని విచారించగా పిల్లలను విక్రయించినట్లు ఒప్పుకున్నది. సుర్బిర్యాల్‌కు చెందిన బత్తుల గంగాధర్‌కు రూ. లక్షకు, జగిత్యాలకు చెందిన వనజకు రూ.2లక్షలకు, భీంగల్‌కు చెందిన దేశబోయి నర్సయ్యకు రూ.1.2 లక్షలకు తన కుమారులను విక్రయించింది.
దీంతో పోలీసులు ముగ్గురి పిల్లలను గుర్తించి అంకాపూర్లోని పొద్దుటూరి బాల ఆశ్రమానికి తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన వారితోపాటు పిల్లలను విక్రయించిన తల్లిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ శనివారం తెలిపారు.