తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొలగించాలని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగించిన కాకతీయులు అనగానే కళాతోరణం గుర్తుకు వస్తుందని, రాజధాని హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే చార్మినార్ చిహ్నం తెలంగాణ చారిత్రక గుర్తులని.. అలాంటి వాటిని తొలగిస్తే చూస్తూ ఊరుకోమని ప్రజలు మండిపడుతున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోని గుర్తులను చెరిపేస్తే.. మరోసారి ఉద్యమం మొదలవుతుందని ఉద్యమకారులు, కవులు, రచయితలు పేర్కొంటున్నారు. రాచరికపు గుర్తులు కావు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన చిహ్నాలని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఉన్న చార్మినార్, కాకతీయ కళా తోరణం మన తెలంగా ణ, సంప్రదాయ, సం స్కృతితోపాటు గత చరి త్ర వైభవాలను గుర్తుచేస్తాయి. వాటిని తొలగిస్తే చరిత్ర వైభవాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్లమవుతాం. చార్మినార్, కాకతీయ కళాతోరణం గుర్తులను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలి.
గాంధారి, మే 29: వందల ఏం డ్ల నాటి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువైన చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలిగించొద్దు. చార్మినార్, కాకతీయ కళాతోరణంతో తెలంగాణ చారిత్రక వైభవం, సంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి. చార్మినార్, కాకతీయ తోరణాలను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే భావితరాలకు మన తెలంగాణ చరిత్ర, సంప్రదాయాల గురించి తెలియకుండా పోతుంది. రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.
డిచ్పల్లి, మే 29: తెలంగాణ అధికారిక చిహ్నం మార్చడం సరైన నిర్ణయం కాదు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలు రాచరికపు గుర్తులు కావు. చార్మినార్ అంటే హైదరాబాద్‌కు ఐకాన్ లాంటిది. వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. చిహ్నాలను తొలగించకుండా పాత వాటినే కొనసాగించాలి.
ఖలీల్‌వాడి, మే 29 : తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. అలనాటి సంస్కృతులు గుర్తు చేసుకునేలా చేశాం. తెలంగాణ చిహ్నంలో ఉన్న కాకతీయుల కళాతోరణం, చార్మినార్ గుర్తులు ప్రపంచానికి తెలుసు. మన సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు తెలియడం లేదు. తెలంగాణ అంటేనే కాకతీయులు, చార్మినార్ గుర్తుకు వస్తుంది. అలాంటిది మార్చుతామంటే ఊరుకుంటామా? మళ్లీ ఉద్యమిస్తాం.
ఖలీల్‌వాడి, మే 29 : రాష్ట్ర అధికారిక చిహ్నాలను తొలగించడానికే ముఖ్యమంత్రి అయ్యావా.. అయ్యా రేవంత్‌రెడ్డి. తెలంగాణ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడు తెలుస్తున్నది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాలన మీద దృష్టి పెట్టడం నేర్చుకొండి. తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది. ఆంధ్రోళ్లకు అప్పగించడానికి కాదు. చిహ్నాల జోళికి వస్తే మళ్లీ ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ గుర్తులు మార్చడమేంటి. మీకు తెలంగాణ చరిత్ర తెలుసా?
ఖలీల్‌వాడి, మే 29: తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడు. తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ప్రజలు నువ్వు ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలోకి తీసుకువస్తే రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేస్తున్నావ్. రాష్ట్రంలో రైతులు ఎలా ఉన్నారు. వారి సరిస్థితి ఏంటి అనే ఆలోచన చేయకుండా తెలంగాణ ఆనవాళ్లు కనుమరుగు చేయాలని చూస్తున్నావ్. తెలంగాణ ప్రజలు సహించరు. తరిమితరిమి కొడతారు. అధికారం ఇచ్చిన ప్రజలే బుద్ధి చెబుతారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ చిహ్నాలు తీసివేస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారు.