వినాయక నగర్ : నిజామాబాద్ ( Nizamabad ) బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి మెడలోంచి బంగారు మంగళసూత్రం చోరీ జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupati ) తెలిపిన మేరకు వివరాలు .. జిల్లాలోని డిచ్పల్లి మండలానికి చెందిన చెలిమెల వర్షిని అనే మహిళ గురువారం తన బంధువుల ఇంటికి వెళ్లింది.
అక్కడి నుంచి ఆమె తన చుట్టాల ఇంటికి గుత్పా గ్రామానికి వెళ్లేందుకు డిచ్పల్లి నుంచి బయలుదేరి నిజామాబాద్‌కు చేరుకుంది. నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌లో (RTC Bus Stand) ఆర్మూర్ బస్సు లో ఎక్కింది. బస్సు లో రద్దీ అధికంగా ఉండడం వల్లన ఆమె తన మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాన్ని తీసి బ్యాగులో పెట్టుకుంది.
కొద్ది సమయం అనంతరం ఆమె తన బ్యాగులో చూసుకోగా రెండు తులాల బంగారు మంగళసూత్రం లేకపోవడంతో చోరీకి గురైనట్లుగా గ్రహించింది. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మంగళ సూత్రం చోరీ ఘటన పై ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.