ఠాణా నుంచి దొంగ పరార్
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉంచి విచారిస్తున్నారు.
ఇందల్వాయి, జనవరి 9 : ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉంచి విచారిస్తున్నారు. మంగళవారం ఒక దొంగ బాత్రూమ్కు వెళ్లి బయటికి రాలేదు. అనుమానంతో పోలీసులు పరిశీలించగా బాత్రూం కిటికీ అద్దాలు ధ్వంసమై కనిపించాయి.
దీంతో దొంగ తప్పించుకున్నట్లు నిర్ధారించుకొని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పారిపోయిన దొంగ కోసం జాతీయ రహదారి పక్కనున్న హోటళ్లు, ముళ్లపొదలను పరిశీలించారు. సీఐలు, ఎస్సైలు సిబ్బందితో బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్ట్‌లు, టోల్‌ప్లాజా, పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్ డిచ్పల్లి ఠాణాకు వచ్చి ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

