సిద్దిపేట, ఆగస్టు 9 : వరికి బదులు ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో రైతు ముకిస పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆదివారం ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై అద్భుతమైన దిగుబడి సాధిస్తున్న రైతులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఐదేండ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో ఆయిల్‌పామ్ తోటలు, అకడి రైతుల జీవనశైలిని చూసి సిద్దిపేట రైతులు కూడా అలాగే ఆర్థికంగా ఎదగాలని బలంగా కోరుకున్నానని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చినప్పటికీ అంతా వరిపంట సాగుచేయడం వల్ల రైతుల ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదన్నారు. సిద్దిపేటలో ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిపుణులను అడిగినప్పుడు మొదట ఇకడ గాలిలో తేమ లేదని చెప్పారని, కానీ మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, చెక్‌డ్యామ్‌లు నిండిన తర్వాత తేమశాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ధారించారని గుర్తుచేశారు. జూన్ 5, 2021న నంగునూరులో ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి మొక నాటగా, సరిగ్గా మూడేండ్ల తర్వాత జూన్ 15, 2024న అకెనపల్లిలో నాగేందర్ అనే రైతు పొలంలో మొద టి గెల కోశారన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ప్రస్తుతం 5,322 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుండగా 3011 ఎకరాల్లో పంట కోత మొదలైందని హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. నంగునూరు మండలం 2750 ఎకరాలతో మొదటి స్థానం, చిన్నకోడూరు మండలం 1050 ఎకరాలతో రెండో స్థానంలో ఉందన్నారు. భవిష్యత్‌లో దీనిని 50 వేల ఎకరాలకు విస్తరించి, రాష్ట్రానికే సిద్దిపేటను దిక్సూచిగా మారుస్తామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం లక్షా 2 వేల ఎకరాల సాగు భూమి ఉంటే, అందులో 88 వేల ఎకరాల్లో కేవలం వరి మాత్రమే పండిస్తున్నారన్నారు. వరి పండిస్తే ఏడాదికి రూ.50 వేలు కూడా మిగలని పరిస్థితి ఉంటే.. రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న మహేందర్ అనే రైతు నెలకు రూ. 50 వేలు సంపాదిస్తున్నాడన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగును మరింత ప్రోత్సహించేందుకు గోద్రెజ్ కంపెనీ అధికారులతో స్వయంగా మాట్లాడినట్లు గుర్తుచేశారు. తకువ ఎత్తు పెరిగి, ఎకువ దిగుబడి ఇచ్చే సరికొత్త సిరాయిడ్ వెరైటీ మొకలు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ నర్సరీలో మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఫ్యాక్టరీ పూర్తయిందని, మరో మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వ రంగంలోనే మొట్టమొదటి ఆయి ల్ పామ్ రిఫైనరీ సిద్దిపేటలోనే ప్రారంభంకానుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సదానందం, నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యరెడ్డి, సత్యనారాయణరెడ్డి,కా ముని శ్రీనివాస్, కీసర పాపయ్య, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణరావుపేట , ఆగస్టు 9 : సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్‌లో రైతు సోప్పరి రవి వ్యవసాయ భూమిలో ఆదివారం ఆయిల్‌పామ్ మొక్కలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోపులాపూర్‌లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో 54 మంది రైతులు,120 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నా రని, లింగారెడ్డి అనే రైతు రెండెకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు పెడితే ఈసారి 5 టన్నుల క్రాప్ వచ్చిందన్నారు. ప్రవీణ్ అనే రైతు మూడెకరాల్లో పెడితే 23 టన్నుల క్రాప్, రవీందర్ రెడ్డి రైతు మూడెకరాల్లో పెడితే 30 టన్నుల క్రాప్, మాజీ ఎంపీపీ బాలమల్లు ఐదెకరాల్లో పెడితే 23టన్నుల క్రాప్ తీశారని తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తే, 3వేల ఎకరాల క్రాప్ వచ్చిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మెటలో ఫ్యాక్టరీ సైతం ఏర్పాటు చేసుకున్నామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఒక సాఫ్ట్వేరు ఇంజినీర్‌కు నెలనెలా జీతం ఎట్లా వస్తదో, ఆయిల్‌పామ్ రైతుకు అలాగే జీతం ఇచ్చే అధిక ఆదాయం వచ్చే పంట ఆయిల్‌పామ్ అన్నారు. వరి సాగులో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని, ఆయిల్‌పామ్‌లో ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. గ్రామం లో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ,వారి ఇంటి దగ్గర ఆయిల్‌పామ్ పంట పెట్టి జీతాలు కూడా తీసుకుంటున్నారని తెలిపారు. రైతులు, యువకులు, చదువుకున్న వాళ్లు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని హరీశ్‌రావు కోరారు. సర్పంచ్ రాజు, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ బాలకృష్ణ పాల్గొన్నారు.