Woman Raped By 6, Two Cops | యువతిని నిర్బంధించి.. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు అత్యాచారం
Woman Raped By 6, Two Cops | కుటుంబంతో గొడవ వల్ల ఒక యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను కొందరు వ్యక్తులు నిర్బంధించారు. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యవసర సహాయ నంబర్‌ను ఆమె సంప్రదించడంతో మహిళా పోలీసులు రక్షించారు.
బెంగళూరు: కుటుంబంతో గొడవ వల్ల ఒక యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను కొందరు వ్యక్తులు నిర్బంధించారు. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యవసర సహాయ నంబర్‌ను ఆమె సంప్రదించడంతో మహిళా పోలీసులు రక్షించారు. (Woman Raped) కర్ణాటకలోని యాద్గిర్లో ఈ దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి కుటుంబ సమస్యల కారణంగా ఇంటిని వీడింది. రైలులో ప్రయాణించిన ఆమె తెల్లవారుజామున యాద్గిర్ చేరుకున్నది. రైల్వే స్టేషన్లో ఒకచోట కూర్చొని ఉన్నది.
కాగా, ఆ యువతితో కలిసి రైలులో ప్రయాణించిన మల్లు అలియాస్ మల్లప్ప అనే వ్యక్తి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సహాయం చేస్తానని నమ్మించి రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించగా పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. మరునాడు రైల్వే పోలీస్ శరణప్ప, మరో పోలీస్ సిబ్బంది ఆ రూమ్‌కు వచ్చారు. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు. అక్కడే ఉండాలని ఆదేశించారు.
ఆ మరుసటి రోజు ఆ యువతిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అక్కడ మహేష్, ఆకాష్ అలియాస్ పప్పు, హర్ష అలియాస్ సుధాకర్ అనే ముగ్గురు యువకులు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
కొన్ని రోజుల పాటు రూమ్‌లో బంధీగా ఉన్న ఆ యువతి చివరకు యాద్గిర్ మహిళా పోలీస్ స్టేషన్ అత్యవసర సహాయ నంబర్‌ను సంప్రదించింది. తన దుస్థితిని వారికి వివరించింది.
కాగా, యాద్గిర్ మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆ యువతిని ఎక్కడ బంధించి ఉంచారో అన్నది తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

