నేడే సర్ ఆఖరు!
రాజధాని హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారదర్శకమైన, పకా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) తుది దశకు చేరుకున్నది. సోమవారం (నేటి)తో సర్ ప్రక్రియ ముగియనుంది.
- రాజధాని పరిధిలో 42 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం
- కోటి 14 లక్షల్లో డూప్లికేట్, డబుల్ ఓట్ల ఏరివేత
- 28 నియోజకవర్గాల్లో ముమ్మరంగా సాగిన సర్వే
- ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలకు అధికారుల ఏర్పాట్లు
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ) : రాజధాని హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారదర్శకమైన, పకా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) తుది దశకు చేరుకున్నది. సోమవారం (నేటి)తో సర్ ప్రక్రియ ముగియనుంది. అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పిస్తూనే… డూప్లికేట్, వలస వెళ్లిన, డబుల్ ఓట్ల ఏరివేతలో భాగంగా దాదాపు 42 లక్షలు చెల్లని ఓట్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
రాజధాని పరిధిలోని మొత్తం 1.14 కోట్ల ఓట్లలో డబుల్ ఓట్లు, నివాసం మారిన వారి పేర్లు, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని వారి వివరాలను క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు పకాగా పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు సొంత ఊళ్లలోనూ, నగరంలోనూ రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం పరిశీలించి జాబితాను సరిచేస్తున్నారు. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు విడుదల చేయనున్నారు. ఇంకా ఎన్యుమరేషన్ ఫారం అందజేయని వారు వెంటనే ఆన్ లైన్ ద్వారా లేదా అధికారులకు సమర్పించి తమ ఓటు హకును భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.
ఏఎస్డీ ఓటర్లుగా..
ఏఎస్డీ ఓటర్లుగా ( ఏ-లేనివారు, ఎస్-వలస వెళ్లినవారు, డీ-మరణించినవారు) మూడు విభాగాల కింద తేల్చగా..నియోజకవర్గాల వారీగా రద్దయ్యే ఓటర్ల సంఖ్యను తేల్చారు. అత్యధికంగా సనత్‌నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 45.68% డూప్లికేట్/చెల్లని ఓట్ల ఏరివేత (మొత్తం 2,54,030 ఓట్లలో దాదాపు 1.16 లక్షల ఓట్లు), అత్యల్ప తొలగింపులు ఇబ్రహీంపట్నంలో 21.43%, బహదూర్ పురాలో 22.38% చొప్పున మాత్రమే ఓట్లు రద్దు కానున్నాయని అంచనా. రెండు చోట్ల ఓటు హకు కలిగి ఉండటం, నివాసం మారడం, సర్వే సమయంలో సమాచారం లభించకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఓట్ల తొలగింపు ఉండనుందని అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేర్లను తనిఖీ చేసుకుని, ఒకవేళ పేరు లేకపోతే, సవరణలు అవసరమైతే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేటితో ఆఖరు
నిర్దేశిత గడువు నేటితో ముగియనున్నది. అయితే బీఎల్ఓలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లగా… కానీ వాటిని తిరిగి ఇవ్వడంలో ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు సైతం ఓటర్లకు సహకరించలేదు. దీంతో పాటు చాలా మంది సొంతూరులోనే ఓటు హక్కును కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో శివారు నియోజకవర్గాలు, ప్రధాన నగరారంలో లక్షల మంది ఫారాలను పక్కన పెట్టేశారు.
జిల్లా/మొత్తం బీఎల్ఓలు : డిజిటైజేషన్(శాతం)
హైదరాబాద్ /4062 : 58.58
రంగారెడ్డి /3501 : 64.91
మేడ్చల్-మల్కాజిగిరి/2435 : 63.82
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

