లండన్, సెప్టెంబర్ 13: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన యూకే పర్యటనలో మిచెలిన్ లేమాన్స్ కప్ రేస్‌ను శనివారం ప్రారంభించారు. నటుడు అజిత్ కుమార్ రేస్‌లో 38వ స్థానంలో నిలిచారు. అజిత్‌తో విజయ్ దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి నటి త్రిష కూడా హాజయ్యారు.
వీరిద్దరూ నిర్ణయించుకుని వచ్చారా? యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ రేసింగ్ ఈవెంట్లో ట్రాక్‌వైపు విజయ్ చూస్తుండగా, హఠాత్తుగా ఫ్రేమ్‌లోకి త్రిష వచ్చింది. దీంతో విజయ్ ఇబ్బంది పడుతూ తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కన్పించింది. ఈ ఘటనతో త్రిషతో తన బంధాన్ని రహస్యంగా ఉంచడానికి విజయ్ ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.