న్యూఢిల్లీ : బ్రిక్స్ దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన గాలా విందుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేస్తూ.. ‘రికార్డుల ప్రకారం 80శాతం భారతీయులు మాంసాహారులే. భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే నా సోదరి చేసిన ఛోలే భటూరే కూడా’ అని రాసుకొచ్చారు. ఆయన పోస్టుపై బీజేపీ నేతలు స్పందించారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాల అధినేతలు గాలా విందు వంటకాలను ఎంతో ఆస్వాదించారని తెలిపారు. అలాగే ఈ వంటకాలు దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందాయని, ప్రోటీన్‌తో కూడినవన్నారు. కాంగ్రెస్ లీడర్లు చివరికి తిండిపై కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. కాగా ఈ విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు అబుదాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మొహ్మద్ కూడా హాజరు కాలేదు.