బడా గణేశ్ ఆగమన్
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి నేటి నుంచి పూజలందుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనులై ఉంటారు. కుడి వైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయం, ఎడమవైపు పాశం, పరుషు, మాల, మొదకం ఉంటుంది.
- తొలి పూజకు హాజరుకానున్న గవర్నర్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి నేటి నుంచి పూజలందుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనులై ఉంటారు. కుడి వైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయం, ఎడమవైపు పాశం, పరుషు, మాల, మొదకం ఉంటుంది.
అలాగే స్వామి వారి కుడివైపు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన సోమనాథుడి లింగం, ఎడమవైపు మండపంలోఅష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సుమారు 700 మంది పోలీసు సిబ్బంది శాంతిభద్రతల విధుల్లో ఉంటారు. తొలి పూజకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

