Kotagiri | కోటగిరి, జూన్ 26 : ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ పక్కగా నిర్వహించాలని, ప్రతీ ఒక్కరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని బాన్స్ వాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో కొనసాగుతున్నసర్ సర్వేను ఆయన ఆకస్మికంగా సందర్శించి బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఆర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నారు.
ఎన్యుమరేషన్ ఫాంలలో తప్పు లు లేకుండా జాగ్రత్తగా చూడాలన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటింటా సర్వే వచ్చే నెల 24 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందద్దని సూచించారు. ఓటర్ల వివరాల నమోదు ఆన్లైన్లో అప్లోడ్ అంశంపై బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కోటగిరి, పోతంగల్ తహసీల్దార్లు గంగాధర్, సందీప్, ఆర్ఐ సునీల్ రెడ్డి, ఐకేపీ సీసీ సాయి బాబా, స్థానిక సర్పంచులు, బీఎల్వోలు ఉన్నారు.