Sirikonda | సిరికొండ, ఆగస్టు 7 : ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీలు విడుదల చేయాలని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దుచేసి ఈపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవ్ సింగ్, రవి, సుధీర్, శ్రీనివాస్, విజేత తదితరులు పాల్గొన్నారు.