Niranjan Reddy | ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివే : సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రాష్ట్రంలో రెండు చోట్ల జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గానే భావిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో రెండు చోట్ల జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ( MLC Elections ) సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గానే భావిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) పేర్కొన్నారు. హైద్రాబాద్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల వారిలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. పట్టభద్రులు అందరూ తాజాగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు గ్రామ, గ్రామానా పట్టభద్రులను కలసి ఓటు నమోదు చేయించాలని కోరారు.
43నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుందని వెల్లడించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న దృష్ట్యా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం శిరోధార్యమని అన్నారు. ఎమ్మెల్సీ విజయంతో ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

