నవీపేట, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్ సర్కారు అన్నదాతలకు అందజేస్తున్న రైతు భరోసాలోనూ మోసం చేస్తున్నది. ఎకరానికి రూ.ఆరు వేల సాయం అందిస్తామన్న సర్కారు ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం లేదు. నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌కు 1.19ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
అతడికి సర్కారు లెక్క ప్రకారం రూ.8,850 రైతు భరోసా రావాల్సి ఉండగా.. కేవలం రూ.862 అతడి బ్యాంకు ఖాతాలో జమచేసింది. ఈ విషయమై అతడు బ్యాంకుకు వెళ్లి అడుగగా.. వారు తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. వ్యవసాయాధికారులను సంప్రదించగా.. ఏదైనా సాంకేతిక సమస్య ఉండవచ్చని తెలిపారని రైతు సురేశ్ అన్నాడు. పంట సాగుచేసిన భూమికి కూడా సాయం అందకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.