Komatireddy Venkata Reddy | పెద్ద కొడప్ గల్(పిట్లం), జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు. తిమ్మానగర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాగా ఆయనకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టరీ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.
తిమ్మా నగర్ వద్ద రూ.4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.