మోర్తాడ్, జనవరి 23: కమ్మర్పల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో పాత పది జిల్లాల క్రీడాకారులు పాల్గొనగా నిజామాబాద్ జిల్లా బాలికలు, బాలుర విభాగాల్లో టోర్నమెంట్ చాంపియన్గా నిలిచింది.
బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు సెమీఫైనల్లో కరీంనగర్ జట్టుపై 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఫైనల్లో వరంగల్ జట్టుపై 11-01 తేడాతో విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు సెమీఫైనల్లో మహబూబ్నగర్ జిల్లా జట్టుపై 08-03తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పైనల్లో మెదక్జిల్లా జట్టుపై 06-01 తేడాతో విజయం సాధించి టోర్నమెంట్ చాంపియన్గా నిలిచింది.
బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో వరంగల్ జిల్లా, తృతీయస్థానంలో ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయస్థానంలో మెదక్, తృతీయస్థానంలో మహబూబ్నగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, సర్పంచ్ కొత్తపల్లి హారికా అశోక్ షీల్డులను అందజేశారు.
వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హన్మంత్రెడ్డి, జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి నాగమణి, స్టేట్ అబ్జర్వర్లు నాగరాజు, వీరేశం, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగామోహన్, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంఈవో ఆంధ్రయ్య, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సుజాత, చిప్ప నవీన్, పీఈటీలు రమేశ్, స్వప్న, దేవ, సుకన్య, వీణ, జ్యోత్స్న, నరేశ్, అనికేత్, ప్రీతి, నాయకుడు సుంకెట రవి పాల్గొన్నారు.