Sirikonda | సిరికొండ, మార్చి 26 : సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామస్వామి విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.
మహిళలు మంగళహారతులు, కోలాటలతో శుభరాత్రిలో పాల్గొని విగ్రహాలను అటవీ ప్రాంతంలోని ఆలయాలకు తరలించారు. సార్లు బాగుందా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.