కోటగిరి, నవంబర్ 7: కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయ్యాలని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ కేవలం పదేండ్లలో పూర్తి చేశారని తెలిపారు. కోటగిరి మండలం గన్నారం, లింగాపూర్, శ్రీనివాసకాలనీ, బస్వాపూర్, అడ్కాస్పల్లి, నాగేంద్రపురం క్యాంప్, దేవునిగుట్టతండా, కొత్తపల్లి, ఎక్లాస్పూర్క్యాంప్, ఎక్లాస్పూర్ గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సాగునీటి వసతులు లేక కరువుకు నిలయంగా ఉండేదని, స్వరాష్ట్ర సాధన అనంతరం తొమ్మిదేండ్లలో ఘననీయమైన ప్రగతిని సాధించామన్నారు. సాగునీటి ఢోకా లేదన్నారు. మాయ మాటలు, మోసపూరిత వాగ్ధానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలంటూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కాలని చూస్తుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశానన్నారు. ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశానని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు కేసీఆర్ పెద్దదిక్కు అని, ఆసరా పథకం కొండంత ధైర్యం నింపారని తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను పెంచనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయితే పింఛన్ మరింతగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, జడ్పీ కోఆప్షన్ సిరాజ్, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, కిశోర్‌బాబు, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, సర్పంచులు దేగాం హన్మంత్, కోళీ రేఖ, రామకృష్ణ, శ్రీధర్,శాంతబాయి పుండలిక్, భారతి, అశోక్‌రెడ్డి, నీరడి గంగాధర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాన్సువాడ/బాన్సువాడరూరల్/నస్రుల్లాబాద్/వర్ని /బాన్సువాడటౌన్, నవంబర్ 7 : బాన్సువాడ పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన సోదరుడు పరిగె శంభురెడ్డి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోచారంతోనే అభివృద్ధి సాధ్యమని, పోచారాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మంచి మనస్సుతో ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల ని కోరారు, కార్యక్రమంలో నాగులగామ వెంకన్న గుప్తా, శివదయాల్ వర్మ, వినయ్‌కుమార్, శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ నాయకులు వాహాబ్, ఖమ్రోద్దీన్, నార్ల నందకిశోర్, రవీందర్‌రెడ్డి, సాయిబాబా గుప్తా, శంకర్, వనం గంగాధర్, నర్సింహాచారి, ఖయ్యుం, గౌస్ తదితరులు ఉన్నారు. బీర్కూర్తోపాటు దామరంచ, కిష్టాపూర్, చించొల్లి, సంబాపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. కార్యక్రమంలో రైతుబంధు సమితి కన్వీనర్ అవారి గంగారాం, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, అశోక్, రాంబాబు, మండల కోఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, మన్నన్, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్, హైమద్, ఎంపీటీసీ సందీప్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, కొల్లూరు, హన్మాజీపేట్, కొయ్యగుట్ట, బోర్లం క్యాంపు, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్, దేశాయిపేట్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌నాయక్, రాజేశ్వర్‌గౌడ్, బుడ్మి సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్, హకీం, నాయకులు ప్రశాంత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ, భూనేకర్ ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మన్నె చిన్న సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని 219వ బూత్‌లో సీనియర్ నాయకులు ఎజాస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
స్థానిక కౌన్సిలర్లు రుక్మిణి, హకీం, బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శివ, వార్డు అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి, నస్రుల్లాబాద్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం జోరుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ఇంటింటికీ వెళ్లి ప్రజలుకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, సర్పంచ్ విజయ, విండో చైర్మన్ సుధీర్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాము, నాయకులు ప్రతాప్ సింగ్, సాయిలు, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్ని మండలంలోని జాకోర, కూనిపూర్, మల్లా రం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లా లి గిరి, ప్రధాన కార్యదర్శి వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, ఎంపీటీసీ సభ్యుడు సాయిలు, సర్పంచ్ గోదావరి గణేశ్, ఉప సర్పంచ్ దత్తు, హన్మాండ్లు, కెంపుల సాయిలు, శంకర్, జీసస్ అశ్రత్ తదితరులు పాల్గొన్నారు.