బీర్కూర్/ నస్రుల్లాబాద్, ఆగస్టు 28: పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూతనంగా మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నస్రుల్లాబాద్ మండలంలో 3,547 పెన్షన్లు ఇస్తుండగా మరో 875 కొత్త పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. దేశంలోనే ఆసరా పింఛన్లను అధికంగా, ఎక్కువగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అన్నారు. పేదలు, మధ్యతరగతి వారిని ఆర్థికంగా ఆదుకునే పథకమే ఆసరా పింఛన్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రూ. 35తో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం రూ. రెండు వేలు, మూడు వేల వరకు పెరిగిందన్నారు.
పక్కన ఉన్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో రూ.వెయ్యి, కేరళ, గుజరాత్ రాష్ర్టాల్లో రూ.750, బీహార్ తదితర రాష్ట్రాల్లో కేవలం రూ.400 పెన్షన్ మాత్రమే అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ పింఛన్ కూడా 75 నుంచి 85 ఏండ్ల వయసు మీద పడిన వారికే అందిస్తున్నారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 57 ఏం డ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందిస్తున్నట్లు చరిత్రలో లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 38 లక్షల మందికి ఆసరా పింఛన్లను అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా మరో 10 లక్షల ఆసరా పింఛన్లను అందించడం అభినందనీయమన్నారు. ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రంలోనే అని పేర్కొన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదా యానికి రూ. లక్ష కోట్ల గండి పడిందని, అయినా సీఎం కేసీఆర్ బెదరకుండా పేద వర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి
రాష్ట్రంలో ఆసరా పింఛన్లే కాకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతుబీమా, దళితబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు దే శంలో ఎక్కడా లేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఇతర పార్టీల నాయకులు విమర్శించేందుకు నోరు ఎ లా వస్తుం దో అర్థం కావడంలేదన్నారు. మనం ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
అర్హులకే ఆసరా పింఛన్లు
ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు పేదలు, మధ్యతరగతికి చెందినవారై ఉండాలన్నారు. ధనికులు, ఆస్తులు ఉన్నవారు, కార్లలో తిరిగే వారు కాదన్నారు. ఉద్యోగుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోరాదని అన్నా రు. ఇలాంటి వారు దరఖాస్తు చేసుకోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఆరీఫ్, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, సర్పంచులు పుల్లెన్ బాబురావు, మునిగె కిష్టారెడ్డి, పెర్క పెద్ద అంబయ్య, ఎర్రోల్ల సాయి రాం, దొంతురం విఠల్, సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ, వైస్ ఎంపీపీ కాశీరాం, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో నారాయణ, రైతుబంధు సమితి కన్వీనర్లు ఆవారి గంగారాం, కొరిపెల్లి రాం బాబు తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్‌లో ఏ ర్పా టు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ జన్నుబాయి, జడ్పీ కో- ఆప్షన్ మెంబర్ మాజీద్, సర్పంచ్ గంగామణి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రా ము, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు, తహసీల్దార్ బావయ్య, ఎంపీడీవో సుబ్రహ్మ ణ్యం, నాయకులు ప్రతాప్ సింగ్, కిశోర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి , కంది మల్లేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.