water problem | పోతంగల్, మే 1: తాగునీటి సమస్య తీర్చండి సారూ అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన పలు కాలనీవాసులు గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోతంగల్ మేజర్ పంచాయతీ అయినప్పటికీ గ్రామంలో పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదని వాపోయారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, ఒడ్డేరా కాలనీ, బాజిరెడ్డి కాలనీ లలో కొన్ని నెలలుగా కుళాయి ల్లో నుండి మంచి నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి నీటి సరఫరా లేకపోవడంతో విషయాన్ని అధికారులకు సమాచారం తెలిపినట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశామన్నారు. ఎండలు మండుతుండడంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో చందర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
దయచేసి నేటి సమస్య లేకుండా చేయండి సారు.. : లక్ష్మి ఓడ్డెర కాలనీ పోతంగల్
అధికారులు స్పందించి మా వడ్డెర కాలనీకి కుళాయిల ద్వారా మంచి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకొని నీరు వచ్చేటట్లు చేయాలి. శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు నీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు.. : శంకర్, ఎస్సీ కాలనీ, పోతంగల్
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నీ కుటుంబాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం. వేసవికాలం కావడంతో బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. తక్షణమే అధికారులు పట్టించుకోని నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.
పక్క గల్లీకి వెళ్లాల్సి వస్తోంది : ముస్తాపా, బాజిరెడ్డి కాలనీ, పోతంగల్
మండల కేంద్రంలోని బాజిరెడ్డి కాలనీలో మంచినీటి కోసం ప్రక్కన ఉండే గల్లీలో నుండి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొద్దున లేచి నుండి సాయంత్రం వరకు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నాం. అధికారులు ఒకసారి పర్యవేక్షించి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాం.